పల్స్‌పోలియోపై నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు
నాతవరం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పల్స్ పోలియా కార్యక్రమాన్ని పటిష్టంగా నిర్వహిస్తున్నాయని డీపీఎం నేతల ప్రశాంతి అన్నారు. మండలంలో ఆదివారం పల్స్ పోలియా కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించారు. తాండవ జంక్షన్‌లో పోలియా చుక్కలు వేసే సిబ్బంది నిర్లక్ష్యంగా ఉండడంతో అసహనం వ్యక్తం చేశారు. సిబ్బంది బాధ్యతగా పనిచేయాలని హెచ్చరించారు. సరుగుడు పంచాయతీలో ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి, చెర్లోపాలెంలో రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టరు రాజాన వీర సూర్యచంద్ర, పెద గొలుగొండపేటలో సర్పంచ్ వైఎస్సార్‌సీపీ మండల శాఖ పంచాయతీరాజ్ శాఖ అధ్యక్షుడు మిరపల వెంకటరమణ చిన్నారులకు పోలియా చుక్కలు వేశారు. నాతవరం,గునుపూడి పీహెచ్‌సీ వైద్యాధికారులు నాగభూషణరావు, ప్రసన్నకుమార్, చక్రవర్తి పాల్గొన్నారు.
వైద్యాశాఖ డీపీఎం నేతల ప్రశాంతి
పల్స్‌పోలియోపై నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు


