సంక్రాంతికి ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించాలి
● యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు
సుర్ల మురళీమోహన్
సమావేశంలో మాట్లాడుతున్న
సుర్ల మురళీమోహన్
అనకాపల్లి: వచ్చే ఏడాది సంక్రాతికై న ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీని ప్రకటించాలని, రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు పీఆర్సీ జూన్ 2023తో ముగిసిందని నేటివరకూ పీఆర్సీపై ప్రభుత్వ ఎటువంటి ప్రకటన చేయకపోవడం అన్యాయమని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సుర్ల మురళీమోహన్ అన్నారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో జిల్లా యూటీఎఫ్ కౌన్సిల్ సమావేశంలో ఆదివారం ఆయన మాట్లాడారు. ప్రభుత్వం వెంటనే పీఆర్సీ కమిషనర్‌ని నియమించాలని, పీఆర్సీని అమలు చేసేలోగా మధ్యంతర భృతి (ఐఆర్) సంక్రాంతికి ప్రకటించాలని కోరారు. నేటి వరకూ మూడు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని వాటిని కూడా తక్షణమే ప్రకటించాలని ఆయన కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి గొంది చిన్నబ్బాయి మాట్లాడుతూ బోధనకు సంబంధం లేని కార్యక్రమాలు పాఠశాలల్లో అమలు చేయరాదని ప్రభుత్వాన్ని కోరారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్షురాలు వత్సవాయి శ్రీలక్ష్మి, గౌరవాఽధ్యక్షుడు పంపాన వెంకటరావు, సహధ్యక్షులు రొంగలి అక్కునాయుడు, జిల్లా కోశాధికారి జోగా రాజేష్, జిల్లా కార్యదర్శులు ప్రకాష్, రమేష్, శేషుకుమార్, చైతన్య, రాష్ట్ర కౌన్సిలర్లు ఎల్లయ్య బాబు, గేదెల శాంతిదేవి, మారిశెట్టి వెంకటప్పరావు పాల్గొన్నారు.


