స్పెషల్‌ రైళ్లు పొడిగింపు | - | Sakshi
Sakshi News home page

స్పెషల్‌ రైళ్లు పొడిగింపు

Dec 23 2025 7:24 AM | Updated on Dec 23 2025 7:24 AM

స్పెషల్‌ రైళ్లు పొడిగింపు

స్పెషల్‌ రైళ్లు పొడిగింపు

తాటిచెట్లపాలెం (విశాఖ): ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రస్తుతం నడుస్తున్న పలు ప్రత్యేక రైళ్లు మరికొంత కాలం పొడిగిస్తున్నట్లు వాల్తేర్‌ డివిజన్‌ సీనియర్‌ డీసీఎం పవన్‌కుమార్‌ తెలిపారు.

●విశాఖపట్నం–తిరుపతి(08583) వీక్లీ స్పెషల్‌ విశాఖలో ప్రతీ సోమవారం రాత్రి 7.10 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9.15 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఈ స్పెషల్‌ రైలు ఫిబ్రవరి 23వ తేదీ వరకు పొడిగించబడింది. తిరుగు ప్రయాణంలో తిరుపతి–విశాఖపట్నం(08584) స్పెషల్‌ తిరుపతిలో ప్రతీ మంగళవారం రాత్రి 9.50 గంటలకు బయల్దేరి, మరుసటిరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటంది. ఈ స్పెషల్‌ రైలు ఫిబ్రవరి 24వ తేదీ వరకు పొడిగించబడింది.

●విశాఖపట్నం–తిరుపతి(08547) వీక్లీ స్పెషల్‌ విశాఖలో ప్రతీ బుధవారం రాత్రి 7 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9.15 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఈ స్పెషల్‌ రైలు ఫిబ్రవరి 25వ తేదీ వరకు పొడిగించబడింది. తిరుగు ప్రయాణంలో తిరుపతి–విశాఖపట్నం(08548) స్పెషల్‌ తిరుపతిలో ప్రతీ గురువారం రాత్రి 9.50 గంటలకు బయల్దేరి, మరుసటిరోజు ఉదయం 11.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటంది. ఈ స్పెషల్‌ రైలు ఫిబ్రవరి 26వ తేదీ వరకు పొడిగించబడింది.

●విశాఖపట్నం–చర్లపల్లి(08579) వీక్లీ స్పెషల్‌ ప్రతీ శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు విశాఖలో బయల్దేరి మరుసటిరోజు ఉదయం 8 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. ఈ స్పెషల్‌ రైలును ఫిబ్రవరి 27వ తేదీ వరకు పొడిగించారు. తిరుగు ప్రయాణంలో చర్లపల్లి–విశాఖపట్నం(08580) వీక్లీ స్పెషల్‌ ప్రతీ శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు చర్లపల్లిలో బయల్దేరి మరుసటిరోజు ఉద యం 7 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ స్పెషల్‌ రైలును ఫిబ్రవరి 28వ తేదీ వరకు పొడిగించారు.

పలు రైళ్లు రీ షెడ్యూల్‌

ఖరగ్‌పూర్‌ డివిజన్‌, నారాయణగడ్‌–భద్రక్‌ రైల్వేస్టేషన్‌ సెక్షన్‌ పరిధిలో జరుగుతున్న మూడో లైన్‌ సంబంధిత పనుల నిమిత్తం ఈ మార్గంలో నడిచ పలు రైళ్లు ఆయా తేదీల్లో ఆలస్యంగా బయల్దేరనున్నట్లు వాల్తేర్‌ డివిజన్‌, సీనియర్‌ డివిజన్‌ కమర్షియల్‌ మేనేజర్‌ పవన్‌కుమార్‌ తెలిపారు.

●హౌరా–సికింద్రాబాద్‌(12703) ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ ఈ నెల 24, 26, 28వ తేదీల్లో 3 గంటలు ఆలస్యంగా, 23, 27వ తేదీల్లో గంట ఆలస్యంగా బయల్దేరుతుంది.

●సికింద్రాబాద్‌–హౌరా(12704) ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ ఈ నెల 23న 4 గంటలు, 26న 2 గంటలు, 27న 130 నిమిషాలు ఆలస్యంగా బయల్దేరుతుంది.

●ఎస్‌ఎంవీ బెంగళూరు–అగర్తలా(12503) ఎక్స్‌ప్రెస్‌ ఈ నెల 23వ తేదీన 4గంటలు ఆలస్యంగా బయల్దేరుతుంది.

●హౌరా–ఎస్‌ఎంవీ బెంగళూరు (12245) దురంతో ఎక్స్‌ప్రెస్‌ ఈ నెల 24వ తేదీన 2గంటలు, 26, 28వ తేదీలలో గంట ఆలస్యంగా బయల్దేరుతుంది.

●ఎస్‌ఎంవీ బెంగళూరు –హౌరా(12864) సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ ఈ నెల 23వ తేదీన 5గంటలు ఆలస్యంగా బయల్దేరుతుంది.

●విల్లుపురం–ఖరగ్‌పూర్‌(22604) సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ ఈ నెల 23వ తేదీన 5 గంటలు ఆలస్యంగా బయల్దేరుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement