రాజపుత్ర సమాజ్ అభ్యున్నతికి కృషి చేయాలి
రాజపుత్ర సమాజ్‌లోని ప్రముఖుల్ని
సత్కరిస్తున్న దృశ్యం
అచ్యుతాపురం: రాజపుత్ర సమాజ్‌లో ఉన్న పలువురు పేద విద్యార్థులను చదివించేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. అచ్యుతాపురం మండలంలోని కొండకర్లలో నిర్వహిహించిన అనకాపల్లి జిల్లా రాజ్‌పుత్ర సమాజ్ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. క్షత్రియుల్లో ఉన్న పేదవారి అభ్యున్నతికి రాజ్‌పుత్ర సమాజ్‌లో బాగా స్థిరపడిన వారు సహకరించాలని ఎమ్మెల్యే కేఎస్‌ఎన్ రాజు, ఎంఎల్‌సీ ఇందుకూరి రఘురాజు పిలుపునిచ్చారు. మాజీ ఎంఎల్‌సీ చైతన్య రాజు మాట్లాడుతూ క్షత్రియుల్లో పేద విద్యార్థులకు విద్య, వైద్య సదుపాయాలు కల్పిస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే రమణమూర్తి రాజు మాట్లాడుతూ తాను కూడా క్షత్రియుల్లోని పేద విద్యార్థులను చదివించానని అన్నారు. మాజీ ఎమ్మెల్సీలు డీవీ సూర్యనారాయణ రాజు, పాకలపాటి రఘువర్మ మాట్లాడుతూ విదేశాల్లో స్థిరపడిన సంఘ సభ్యులు సేవా కార్యక్రమాల ద్వారా క్షత్రియ విద్యార్థులకు సహకరించాలని కోరారు.అనకాపల్లి రాజ్‌పుత్ర సమాజ్ అధ్యక్షుడు దిలీప్‌కుమార్‌ను పలువుర్ని సత్కరించారు. కార్యక్రమంలో ఏపీ క్షత్రియ ఫెడరేషన్ ఛైర్మన్ జీఎస్ రాజు, వైస్ చైర్మన్ కేకే రాజు, సీఎస్‌ఎన్ రాజు, రాధా సుందర సుబ్బరాజు, మంతెన లీలావతి, నరేంద్ర రాజు పాల్గొన్నారు.


