రాష్ట్ర స్థాయి సైన్సు ఫెయిర్‌కు ఎంపిక
మాడుగుల రూరల్: రాష్ట్ర స్థాయి సెన్సు ఫెయిర్‌కు మండలంలో జి.అగ్రహారం జిల్లా పరిషత్ హైస్కూలు విద్యార్థులు ఎంపికయ్యారని పాఠశాల హెచ్‌ఎం బి. ఉమాశంకర్ శనివారం తెలిపారు. జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ఈ నెల 19 వ తేదీ శుక్రవారం చోడవరం హైస్కూల్లో నిర్వహించారు. ఈ ప్రదర్శనలో పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సైన్సు ప్రయోగాలు అబ్బురపరిచాయి. గైడ్ ఉపాధ్యాయుడు దేవవర్మ సారథ్యంలో పాఠశాలలో 9 వ తరగతి చదువుతున్న విద్యార్థినులు ఆర్లె గాయత్రి, నందారపు లక్ష్మీ ప్రసన్నలు, మ్యాథమెటికల్ మోడలింగ్‌లో టవర్ ఆఫ్ హోనోయ్ (బ్రహ్మస్తంభం, మరియు మీ పుట్టిన తేదీ చెపుతా అనే అంశాలపై తయారు చేసిన ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు ఎంపికయ్యాయి. ఆయా విద్యార్థులను పాఠశాల వర్గాలు అభినందించారు.
కె.కోటపాడు: చోడవరంలో ఈ నెల 19న జరిగిన జిల్లా స్థాయి విద్య, వైజ్ఞానిక ప్రదర్శనలో మండలంలో ఎ.కోడూరు హైస్కూల్‌కు చెందిన విద్యార్థులు సుస్ధిర వ్యవసాయం కేటగిరిలో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారు. ఆయా విద్యార్థినులు ఈర్లె నవ్య, భార్గవిలను నిర్వాహకులు అభినందించి షీల్డ్‌లతో పాటు సర్టిఫికెట్‌లను అందించారు. ఈ ప్రదర్శన రాష్ట్ర స్ధాయికి ఎంపిక కావడంతో ఈ నెల విజయవాడలో 23, 24 తేదీల్లో జరిగే పోటీల్లో విద్యార్థులు ప్రదర్శిస్తారని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎ.శేఖర్ తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు ఎంఈవోలు సత్యనారాయణ, డీవీడీ ప్రసాద్ తదితరులు అభినందనలు తెలిపారు.


