మూడు టన్నుల ధాన్యం చోరీ
దేవరాపల్లి: మండలంలో అన్నదాతలు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం అర్ధరాత్రి అపహరించారు. ఎం.అలమండ, ఎన్.జి. నగరం గ్రామాలకు చెందిన రైతులు నూర్చి విక్రయించేందుకు తమ కల్లాల్లో సిద్ధంగా ఉంచిన ధాన్యం బస్తాలను చోరీ చేశారు. సుమారు రూ. 3 లక్షల విలువైన 3 టన్నుల ధాన్యం చోరీకి గురైనట్టు బాధిత రైతుల ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు శనివారం విచారణ ప్రారంభించారు. ఎం.అలమండ గ్రామానికి చెందిన పీలా బలరాం (16 బస్తాలు), పొలిపిరెడ్డి రమణ(10 బస్తాలు), గొల్లు నరసమ్మ(ఆరు బస్తాలు), రొంగలి సన్నిబాబు(నాలుగు బస్తాలు), ఎల్లపు ఈశ్వరరావు(మూడు బస్తాలు), ఎన్.జి. నగరానికి చెందిన రొంగలి వెంకటరావు(15 బస్తాలు), ఆదిరెడ్డి మౌళి (12 బస్తాలు), బర్ల త్రిమూర్తులు(3 బస్తాలు) ఽతదితర రైతులు తమ ధాన్యం బస్తాలు చోరీకి గురైనట్లు తెలిపారు. ప్రతీ ఏటా మాదిరిగా నూర్చిన ధాన్యాన్ని గోనె సంచుల్లో నింపి కల్లాల్లోనే టార్పాలిన్లతో కప్పి ఉంచామన్నారు. రోడ్డుకు ఆనుకొని ఉన్న కల్లాల్లో ధాన్యం బస్తాలను అపహరించుకుపోయారని తెలిపారు. అర్ధరాత్రి వరకు తామంతా కల్లాల్లోనే ఉన్నామని, శనివారం తెల్లవారు జామున వచ్చి చూడగా కొన్ని బస్తాలు మాయమయ్యాని రైతులు వాపోయా రు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి కష్టపడి పండించిన పంట దొంగల పాలైందని, గతంలో ఎన్న డూ ఇలాంటి దొంగతనాలు జరగలేదని అన్నదాతలు తెలిపారు.
కల్లాల్లో ఉంచిన బస్తాలు అపహరణ


