మచ్చలేని నేత వాజ్‌పేయి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ
భారత్ మాతాకీ జై అంటూ నినదిస్తున్న కూటమి నాయకులు
అనకాపల్లి టౌన్: నీతి, నిజాయితీ, నిబద్ధత కలిగిన మచ్చలేని నేత మాజీ ప్రధాని వాజ్‌పేయి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. స్థానిక జలగల మదుం జంక్షన్ వద్ద వాజ్‌పేయి విగ్రహావిష్కరణ చేశారు. మాధవ్ మాట్లాడుతూ విలువలకు అద్దం పట్టే రాజకీయాలు చేసిన నాయకుడు వాజ్‌పేయి అన్నారు. టీడీపీ జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ అమరావతిలో వాజ్‌పేయి విగ్రహావిష్కరణ చేపడుతున్నట్లు తెలిపారు. ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యేలు విజయ్‌కుమార్, బండారు , కొణతాల రామకృష్ణ, కేఏఎస్‌ఎన్ రాజు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపూడి పరమేశ్వరావు, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు పాల్గొన్నారు. ఏబీ వాజ్‌పేయి విగ్రహావిష్కరణ శిలా ఫలకంపై స్థానిక ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పేరు లేకపోవడంతో జనసేన శ్రేణులు కినుక వహించారు.


