గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు
ఖరగ్‌పూర్ ఐఐటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ గౌరవ్‌దాస్ మహాపాత్ర
రోలుగుంట: గ్రామాల అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలను వీఎంఆర్‌డీఏ రూపొందిస్తున్నట్టు ఖరగ్‌పూర్ ఐఐటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ గౌరవ్‌దాసు మహాపాత్రో తెలిపారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గ్రామాల్లో సమస్యలు, వాటి పరిష్కారంపై సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులతో ఏవో లక్ష్మి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న గౌరవ్‌దాస్ మహాపాత్రో పంచాయతీల వారీగా ఉన్న సమస్యలను తెలుసుకుని నివేదికలు రూపొందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నివేదికలపై ప్రజలతో చర్చించనున్నట్టు చెప్పారు. వాటిలో అత్యవసర సమస్యలను గుర్తించి ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ గ్రామాలభివృద్ధే లక్ష్యంగా మాస్టర్ ప్లాన్ రూిపొందిస్తున్నట్టు ఆయన చెప్పారు.


