సబ్బవరం హత్య కేసులో పోలీసుల ప్రతిభ
అనకాపల్లి: శాసీ్త్రయ ఆధారాలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఒక క్లిష్టమైన హత్య కేసును తక్కువ సమయంలో ఛేదించినందుకు పరవాడ డీఎస్పీ విష్ణు స్వరూప్‌కు శుక్రవారం అమరావతిలో డీజీపీ కార్యాలయంలో డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా అవార్డు అందజేశారు. ఈ ఏడాది ఆగస్టు 14న సబ్బవరం మండలం, బాటాజంగాలపాలెం వద్ద గుర్తు తెలియని మహిళ మృతదేహం సగం కాలిన స్థితిలో లభించింది. మృతురాలి వివరాలు గానీ, నిందితుల ఆనవాళ్లు గానీ లేని ఈ ‘బ్లైండ్ మర్డర్‘ కేసు త్వరితగతిన పూర్తి చేసినందుకు అవార్డు వచ్చిందని డీఎస్పీ చెప్పారు. ఈ కేసులో దాదాపు 14,000కు పైగా మొబైల్ నంబర్లను (టవర్ డంప్), 450కి పైగా సీసీ టీవీ ఫుటేజిలను, 1,000కి పైగా వాహనాల సమాచారాన్ని సేకరించి, పెట్రోల్ బంక్ వద్ద లభించిన దృశ్యాలు, నిందితుడు మురళీధర్‌రెడ్డి వాడిన స్విఫ్ట్ డిజైర్ కారు ఆధారంగా నిందితులను గుర్తించామన్నారు. ఆస్తి తగాదాలు, కుటుంబ కలహాల కారణంగా మృతురాలు బాంకిల సంతురెడ్డిని ఆమె బావ మురళీధర్‌రెడ్డి, మృతురాలి కుమార్తె అనూషతో కలిసి హత్య చేసినట్లు విచారణలో తేలిందన్నారు. అవార్డులు అందుకున్న వారిలో పరవాడ పోలీస్ డివిజన్ పరిధిలో సబ్బవరం సీఐ జి.రామచంద్రరావు, సబ్బవరం, మునగపాక ఎస్‌ఐలు పి.సింహాచలం, పి.ప్రసాదరావు, టాస్క్‌ఫోర్స్ సీఐ టి.రమేష్‌లను డీజీపీ సర్టిఫికెట్లతో అభినందించారు.
డీజీపీ నుంచి అవార్డు అందుకున్న
పరవాడ డీఎస్పీ


