● ఇప్పుడున్న నాయకుల్లో అత్యధికం ఆయన శిష్యులే ● ద్రోణంరాజు సత్యనారాయణ జయంతి సభలో వక్తలు | - | Sakshi
Sakshi News home page

● ఇప్పుడున్న నాయకుల్లో అత్యధికం ఆయన శిష్యులే ● ద్రోణంరాజు సత్యనారాయణ జయంతి సభలో వక్తలు

Dec 20 2025 7:06 AM | Updated on Dec 20 2025 7:06 AM

● ఇప్పుడున్న నాయకుల్లో  అత్యధికం ఆయన శిష్యులే ● ద్రోణంర

● ఇప్పుడున్న నాయకుల్లో అత్యధికం ఆయన శిష్యులే ● ద్రోణంర

● ఇప్పుడున్న నాయకుల్లో అత్యధికం ఆయన శిష్యులే ● ద్రోణంరాజు సత్యనారాయణ జయంతి సభలో వక్తలు

ద్రోణంరాజు ఓ రాజకీయ యూనివర్సటీ

బీచ్‌రోడ్డు: ఉత్తరాంధ్ర టైగర్‌గా పేరుగాంచిన ద్రోణంరాజు సత్యనారాయణ ఒక రాజకీయ విశ్వవిద్యాలయం వంటివారని, నేడు పదవుల్లో ఉన్న ఎంతోమంది ఆయన శిష్యులేనని రాజ్యసభ మాజీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, వైఎసా్‌స్‌ర్‌ సీపీ జిల్లా అధ్యక్షులు కేకే రాజు పేర్కొన్నారు. ద్రోణంరాజు సత్యనారాయణ 93వ జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ద్రోణంరాజు శ్రీవత్సవ ఆధ్వర్యంలో సిరిపురంలోని జంక్షన్‌లోని ద్రోణంరాజు సర్కిల్‌ వద్ద నిర్వహించిన కార్యక్రమానికి వ్యక్తలు మాట్లాడారు. ద్రోణంరాజు కుమారుడు స్వర్గీయ ద్రోణంరాజు శ్రీనివాస్‌ కూడా నిబద్ధత గల నాయకుడిగా ఎదిగారన్నారు. తండ్రి శ్రీనివాస్‌ అడుగుజాడల్లో శ్రీవత్సవ నడవడం అభినందనయీమన్నారు. అనంతరం ద్రోణంరాజు శ్రీవత్సవ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం తన తాతగారు చేసిన కృషి, తన తండ్రి సంపాదించిన నిష్కళంకమైన పేరు తనకు స్ఫూర్తిదాయకమని, వారి ఆశయాల సాధన కోసం తాను నిరంతరం శ్రమిస్తానని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మాజీ ప్రభుత్వ విప్‌ కరణం ధర్మశ్రీ, మాజీ మేయర్‌ గొలగాని హరి వెంకట కుమారి, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయకుమార్‌, తిప్పల నాగిరెడ్డి, చింతలపూడి వెంకటరామయ్యతో, సమన్వయకర్తలు మొల్లి అప్పారావు , తిప్పల దేవన్‌ రెడ్డి , పార్టీ నేతలు కోలా గురువులు , డాక్టర్‌ జహీర్‌ అహ్మద్‌, కొండా రాజీవ్‌ గాంధీ, కార్పొరేటర్లు బాణాల శ్రీనివాస్‌, చెన్నా జానకీరామ్‌ , బిపిన్‌ కుమార్‌ జైన్‌, ముమ్మన దేముడుు, ఉరుకూటి టి చందు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement