స్క్రాప్‌లోడ్‌తో లారీ బోల్తా
మాకవరపాలెం సెంటర్‌లో బోల్తాపడిన లారీ
నర్సీపట్నం: మండల కేంద్రమైన మాకవరపాలెం బస్టాండ్ వద్ద స్క్రాప్‌లోడుతో లారీ బోల్తాపడింది. స్క్రాప్ లోడుతో నర్సీపట్నం నుంచి అనకాపల్లి వైపు వెళ్తుంది. రోడ్డు మధ్యలో వేసిన చిన్నపాటి డివైడరు కనిపించకపోవడంతో డ్రైవర్ డివైడర్ ఎక్కించేశాడు. దీంతో లారీ బోల్తా కొట్టింది. సంఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో జనం ఊపిరిపీల్చుకున్నారు. డివైడర్ వల్ల తరుచూ వాహనాలు బోల్తా కొడుతున్నాయి. అయినప్పటికీ అర్‌అండ్‌బీ అధికారులు మొద్దు నిద్ర వీడడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇప్పటికై నా డివైడర్లను తొలగించి ప్రమాదాలను ఆరికట్టాలని కోరుతున్నారు.


