పశు వైద్యసేవలను నిర్లక్ష్యం చేయవద్దు
మామిడిపల్లి పశువైద్యశాలలో రికార్డులు తనిఖీ చేస్తున్న పశు సంవర్ధకశాఖ జిల్లా డిప్యూటీ డైరక్టర్ డా. చంద్రశేఖర్
దేవరాపల్లి : పశు వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం చేయరాదని పశు సంవర్ధకశాఖ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ డా.ఎం.చంద్రశేఖర్ పశు వైద్య సిబ్బందికి సూచించారు. మామిడిపల్లి పశువైద్యశాలను గురువారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలో పరిధిలోని నిర్వహిస్తున్న పశు టీకా కార్యక్రమాలపై స్థానిక పశువైద్యాధికారి జి.ప్రియాంకను ఆరా తీశారు. హెమోరాజిక్ సెప్టిసీమియా (గేదెల్లో బ్యాక్టీరియాల వల్ల వ్యాప్తించే తీవ్రమైన అంటు వ్యాధి) పునరావృత టీకా కార్యక్రమం జరుగుతుందని, మండలంలో 600 డోస్‌లు సిద్ధంగా ఉన్నాయన్నారు. మండలంలో 3వేల మేకలకు గోట్ ఫాక్స్ నివారణ టీకా కార్యక్రమం పూర్తి చేశారన్నారు. ఆడ దూడలు జన్మించేందుకు సెక్స్ సార్టెడ్ సీమెన్‌ను ప్రభుత్వ సబ్సిడీపై అందిస్తుందన్నారు. మండలంలో 78 గోకులం షెడ్లు మంజూరయ్యాయన్నారు.


