
మహిళ అదృశ్యంపై కేసు నమోదు
యలమంచిలి రూరల్: పట్టణంలోని పాతవీధికి చెందిన వివాహిత మహిళ రాజాన లక్ష్మి(43) ఈ నెల 19వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుంచి కనిపించడం లేదని ఆమె భర్త రాజాన వెంకట రవి మోహన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గిడిజాలలో ఉన్న చిన్న కుమారుడి వద్దకు వెళతానని చెప్పి ఈ నెల 19 ఉదయం వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి రాలేదు. ఇంటి నుంచి వెళ్లినపుడు ఆమె ఎరుపు రంగు చీర ధరించి ఉన్నట్టు ఆమె భర్త పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పట్టణ ఎస్‌ఐ కె.సావిత్రి తెలిపారు.