
మెలిపాక విద్యార్థికి పీజీ నీట్‌లో 1913వ ర్యాంక్
మునగపాక: మండలంలోని మెలిపాకకు చెందిన డాక్టర్ గుర్రం శ్రీనివాస్ కుమార్ పీజీ నీట్ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో జాతీయ స్థాయిలో 1913వ ర్యాంక్ సాధించారు. 2025 సంవత్సరానికి గాను ఇటీవల నీట్ పీజీ ప్రవేశ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. మంగళవారం సాయంత్రం విడుదలైన ఫలితాల్లో శ్రీనివాస్ కుమార్ 612/800 మార్కులతో మెరుగైన ర్యాంక్ తెచ్చుకున్నారు. ఎండీ జనరల్ మెడిసిన్‌లో చేరేందుకు అర్హత సాధించారు. తర్వాత సూపర్ స్పెషలైజేషన్ చేసి న్యురాలజిస్టుగా ప్రజలకు సేవలందించాలన్న లక్ష్యం తనకుందని శ్రీనివాస్ కుమార్ తెలిపారు. ఆయన తండ్రి శ్రీనివాస్ చూచుకొండ పీహెచ్‌సీలో ఆరోగ్య విస్తరణ అధికారిగా సేవలందిస్తున్నారు. తల్లి గృహిణి కాగా సోదరి వీర వెంకట శరణ్య ఆంధ్ర వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరం చదువుతోంది.