
వ్యక్తి అదృశ్యం
కశింకోట: హైదరాబాద్‌కు చెందిన షేక్ షాజిద్ కనిపించడం లేదంటూ ఆయన భార్య ఫిర్యాదు చేసిన మేరకు సోమవారం కేసు నమోదు చేశామని సీఐ అల్లు స్వామినాయుడు తెలిపారు. పదేళ్ల క్రితం కశింకోటకు వలస వచ్చి ఇక్కడ జాతీయ రహదారిపై బిర్యాని పాయింట్ నడుపుతూ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 11న బిర్యానీ సామాన్లు కొనుగోలు చేయడానికి స్కూటీపై అనకాపల్లికి వెళ్లి తిరిగి రాలేదన్నారు. చుట్టు పక్కల వెతికినా ఫలితం లేకపోవడంతో భార్య షాహిన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.