కానిస్టేబుల్‌ కుటుంబానికి రూ. 2.88 లక్షల వితరణ | - | Sakshi
Sakshi News home page

కానిస్టేబుల్‌ కుటుంబానికి రూ. 2.88 లక్షల వితరణ

Oct 27 2026 1:02 AM | Updated on Oct 27 2026 1:02 AM

దేవరాపల్లి: మండలంలోని కొత్తపెంటలో ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన కానిస్టేబుల్‌ పైలా మోహన్‌ కుటుంబానికి సహచర పోలీస్‌ కానిస్టేబుళ్లు అండగా నిలిచారు. ఉమ్మడి విశాఖపట్నంలోని 2009 బ్యాచ్‌ కానిస్టేబుళ్లు, హెడ్‌ కానిస్టేబుళ్లు రూ. 2,88,000 నగదును కొత్తపెంటలో అతని కుటుంబ సభ్యులకు సోమవారం అందజేశారు. ముందుగా మోహన్‌ సంస్మరణ సభలో పాల్గొని అతని చిత్రపటం వద్ద పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. విధి నిర్వహణలో ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు. మోహన్‌ కుటుంబానికి తమ వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని వారంతా భరోసా నిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement