ముంచంగిపుట్టులో కూటమి ఘోర పరాజయం | - | Sakshi
Sakshi News home page

ముంచంగిపుట్టులో కూటమి ఘోర పరాజయం

Nov 8 2026 12:43 AM | Updated on Nov 8 2026 12:43 AM

ముంచంగిపుట్టు: మండలంలోని 14 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఎనిమిది స్థానాలను కై వసం చేసుకుంది. కూటమి అభ్యర్థులు కనీస పోటీ కూడా ఇవ్వలేక మూడు స్థానాలకే పరిమితమయ్యాయి. మిగిలిన స్థానాల్లో సీపీఎం, స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. వైఎస్సార్‌సీపీ తరఫున జర్జుల సెగ్మెంట్‌లో పాంగి పద్మారావు, సుజనకోటలో మజ్జి సుబ్బలక్ష్మి, పెదగూడలో తమర్భ నాగరత్నం, దారెలలో అరిసెల సీతమ్మ, కుమడలో తాల్లోయ్‌ భాస్కరరావు, బరడలో జనం ప్రమీల, జోలాపుట్టులో సీసా లక్ష్మి, రంగబయలులో సిరగం భాగ్యవతి విజయం సాధించారు. లక్ష్మీపురం సెగ్మెంట్‌లో సీపీఎం అభ్యర్థి కొర్ర మల్లేశ్వరరావు గెలుపొందారు. బంగారుమెట్ట, కిలగాడ సెగ్మెంట్లలో జనసేన అభ్యర్థులు కోడా చంద్రుబాబు, వంతాల కొండమ్మ విజయం సాధించారు. బాబుశాలలో టీడీపీ అభ్యర్థి కిల్లో గణే ష్‌పడాల్‌ గెలుపొందారు. కించాయిపుట్టు, మాకవరం సెగ్మెంట్లలో స్వతంత్ర అభ్యర్థులు రొబ్బ అరుణ, మట్టం రషుపతిపడాల్‌ విజయం సాధించారు. జెడ్పీటీసీ బరిలో మొదటి స్థానంలో సీపీఎం అభ్యర్థి కొర్రా త్రినాథ్‌, ద్వితీయస్థానంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి జల్లిపల్లి సుభద్ర నిలవగా జనసేన అభ్యర్థి శ్రవణ్‌కుమార్‌ మూడు స్థానంలో నిలిచారు.

జెడ్పీటీసీ బరిలో మూడు స్థానానికి

దిగజారిన జనసేన అభ్యర్థి శ్రవణ్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement