చింతపల్లి: మండలంలో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఆధిక్యం ప్రదర్శించింది. మొత్తం 20 ఎంపీటీసీ సెగ్మెంట్లకు గాను 10 స్థానాలను వైఎస్సార్‌సీపీ కై వసం చేసుకోగా, టీడీపీ 4, జనసేన 3, స్వతంత్ర అభ్యర్థులు 3 స్థానాల్లో విజయం సాధించారు. మండలంలో మొత్తం 64,374 మంది ఓటర్లకు గాను 34,155 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. శనివారం జరిగిన ఓట్ల లెక్కింపులో గెలుపొందిన అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి.
● వైఎస్సార్‌సీపీ తరఫున బలపం నుంచి లెరడా లక్ష్మీపార్వతి సమీప జనసేన అభ్యర్థిపై 152 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. తమ్మెంగులులో సాగిన శాంతి 121 ఓట్లు, అన్నవరంలో సుండ్రు శిరీషకుమారి 267 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. కొత్తపాలెం–1లో కిల్లో భీమరాజు 246, కొత్తపాలెం–2లో మఠం గణేష్ 275, లోతుగెడ్డలో సాగిన నాగవెంకటలక్ష్మి 654, చింతపల్లి–2లో దాసరి దారలక్ష్మిపద్మ 48, కొమ్మంగిలో లోచలి రాంబాబు 124, గొందిపాకులలో పొటుకూరి దేవి 513, మర్రి కళావతి 144 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
● కుడుముసారి, లంబసింగి, కిటుములు, ఎర్రబొమ్మలులో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. చింతపల్లి–1, చింతపల్లి–2, బెన్నవరంలో జనసేన అభ్యర్థులు విజయం సాధించారు. చౌడుపల్లి, తాజంగి, పెదబరడ పంచాయతీల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు.
జెడ్పీటీసీగా కోరాబు అనూషదేవి
చింతపల్లి జెడ్పీటీసీ స్థానాన్ని వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కోరాబు అనూషదేవి కై వసం చేసుకున్నారు. ఆమెకు 14,799 ఓట్లు పోలవగా, సమీప టీడీపీ అభ్యర్థి సాగిన అన్నపూర్ణదేవికి 11,375 ఓట్లు వచ్చాయి. దీంతో 3,424 ఓట్ల మెజారిటీతో అనూషదేవి ఘన విజయం సాధించారు.
జెడ్పీటీసీ, 10
ఎంపీటీసీ స్థానాలు వైఎస్సార్‌సీపీ కై వసం


