పెదబయలులోనూ పాగా | - | Sakshi
Sakshi News home page

పెదబయలులోనూ పాగా

Nov 8 2026 12:43 AM | Updated on Nov 8 2026 12:43 AM

పెదబయలు: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. జెడ్పీటీసీ స్థానాన్ని భారీ మెజారిటీతో కై వసం చేసుకోవడంతో పాటు, 15 ఎంపీటీసీ స్థానాలకు గాను పది స్థానాల్లో విజయం సాధించారు. జెడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వంతాల శాంతికి 13,097 ఓట్లు పోలవగా, సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి వెచ్చంగి సుశీలకు 8,999 ఓట్లు వచ్చాయి. దీంతో వంతాల శాంతి 4,098 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. మండలంలో గత ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థులే విజయం సాధించారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో 2021లో వచ్చిన మెజారిటీ కంటే అధికంగా 4,098 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. అలాగే 15 ఎంపీటీసీ స్థానాలకు గాను వైఎస్సార్‌సీపీ పది స్థానాలను కై వసం చేసుకుంది. టీడీపీ మూడు, బీజేపీ ఒకటి, జనసేన ఒక స్థానంలో విజయం సాధించాయి. పార్టీ అభ్యర్థుల విజయంతో మండల వ్యా ప్తంగా కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. గెలుపొందిన అభ్యర్థులు వైఎస్సార్‌ పార్కులోని వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ.. 2029 ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిని చేసేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తామని తెలిపారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఇదే ఉత్సాహంతో రానున్న 23 గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. మండల ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవలందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పది మంది ఎంపీటీసీ అభ్యర్థులు, మాజీ జెడ్పీటీసీ కూడ బొంజుబాబు, వంతాల అప్పారావు, గంపరాయి సూరయ్య, పార్టీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

జెడ్పీటీసీతో పాటు పది స్థానాల్లో

వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement