గూడెంకొత్తవీధిలో విజయదుందుభి | - | Sakshi
Sakshi News home page

గూడెంకొత్తవీధిలో విజయదుందుభి

Nov 8 2026 12:43 AM | Updated on Nov 8 2026 12:43 AM

14 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల హవా

గూడెంకొత్తవీధి: మండలంలో వైస్సార్‌సీపీ విజయదుందుభి మోగించింది. 18 ఎంపీటీసీ స్థానాల్లో 14 చోట్ల గెలుపొందింది. కూటమి నాలుగు స్థానాలకు పరిమితమైంది. వైఎస్సార్‌సీపీకి చెందిన జెడ్పీటీసీ అభ్యర్థి కంకిపాటి గిరిప్రసాద్‌ టీడీపీ అభ్యర్థి రొబ్బ పుష్పపై విజయం సాధించారు. పాడేరు మాజీ ఎమ్మె ల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి విజేతలను అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజనులు వైఎస్సార్‌ సీపీకి పట్టం కట్టడం ఆనందంగా ఉందన్నారు.

సీలేరు: సీలేరులో కూటమి అభ్యర్థి నాగమణిపై వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఎం. ప్రియ వంద ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. దుప్పులవాడ సెగ్మెంట్‌ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వెలుగూరి సత్యనారాయణ కాంగ్రెస్‌ అభ్యర్థి సొన్నుపై 86 ఓట్ల మెజారిటీ విజయం సాధించారు. ధారకొండ టీడీపీ అభ్యర్థిపై వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బాకూరి రాజేశ్వరి 120 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గుమ్మరేవుల సెగ్మెంట్‌లో టీడీపీ అభ్యర్థిపై వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కొర్రా అప్పారావు 56 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గాలికొండ సెగ్మెంట్‌లో టీడీపీ అభ్యర్థిపై వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గొంతులొంగి జ్యోతి రాణి 158 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement