జిల్లా పరిషత్‌ కార్యాలయం ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

జిల్లా పరిషత్‌ కార్యాలయం ప్రారంభం

Sep 26 2026 12:56 AM | Updated on Sep 26 2026 12:56 AM

పాడేరు: అల్లూరి సీతారామరాజు జిల్లా పరిషత్‌ కార్యాలయం శుక్రవారం ప్రారంభమైంది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా విభజన అనంతరం పాడేరు ఎంపీడీవో కార్యాలయంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన జెడ్పీ కార్యాలయాన్ని కలెక్టర్‌, జిల్లా ప్రత్యేకాధికారి నిశాంతి శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం తన చాంబర్‌లో జిల్లా ప్రత్యేక అధికారిగా ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా పరిషత్‌లను విభజించిందన్నారు. స్థానిక జెడ్పీకి 19 ఉద్యోగులను కేటాయించగా, వారిలో 17 మంది విధుల్లో చేరారని, మిగిలిన రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. పాడేరు పట్టణ శివారులోని పాత కమ్యూనిటీ భవనంలో పూర్తి స్థాయి కార్యాలయాన్ని సిద్ధం చేస్తున్నామని, మరో రెండు వారాల్లో అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. జెడ్పీకి కేటాయించిన అధికారులు, ఉద్యోగులు తమ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జానపద కళలు, సృజనాత్మక అకాడమీ చైర్మన్‌ గంగులయ్య, ఆర్టీసీ రీజినల్‌ చైర్మన్‌ దొన్నుదొర, మాజీ ఎమ్మెల్యే ఈశ్వరి, జెడ్పీ డిప్యూటీ సీఈవో రాజ్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పరిషత్‌ ఉద్యోగులు సర్దుబాటు

మహారాణిపేట: ఉమ్మడి విశాఖ జిల్లాలో నూతనంగా ఏర్పాటైన జిల్లా ప్రజా పరిషత్‌లకు అధికారులు, సిబ్బంది నియామకం చేపట్టారు. ఉమ్మడి విశాఖ జిల్లాను మూడు జిల్లా పరిషత్‌లుగా విభజించిన సంగతి విదితమే. నాలుగు మండలాలతో విశాఖ జిల్లా పరిషత్‌, 24 మండలాలతో అనకాపల్లి జిల్లా పరిషత్‌, 11 మండలాలతో అల్లూరి జిల్లా పరిషత్‌ ఆవిర్భవించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement