ఎస్పీ కార్యాలయంలో 51 ఫిర్యాదులు | - | Sakshi
Sakshi News home page

ఎస్పీ కార్యాలయంలో 51 ఫిర్యాదులు

Sep 8 2026 12:29 AM | Updated on Sep 8 2026 12:29 AM

అనకాపల్లి : ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్‌ఎస్‌కు జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి 51 ఆర్జీలు వచ్చాయి. ఎస్పీ తుహిన్‌ సిన్హా ఆర్జీలు స్వీకరించి, వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ చట్టపరిధిలో సమస్యలను వారం రోజుల్లో పరిష్కారానికి చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. భూ తగాదాలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక మోసాలు, భార్యాభర్తల వేధింపులు, గృహ కలహాలు, శాంతిభద్రతలు, పౌర సమస్యలపై ఆర్జీలు స్వీకరించడం జరిగిందని, సమస్యలు పరిష్కారానికి చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్‌.మోహన్‌రావు, ఎస్‌ఐ శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement