నర్సీపట్నం : నంద్యాలలో ఐ న్యూస్ రిపోర్టర్స్ అరెస్ట్ అప్రజాస్వామికం, వారిని బేషరతుగా విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర కార్యదర్శి సిహెచ్.బి.ఎల్.స్వామి డిమాండ్ చేశారు. వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చిన అంశాలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఖండన ఇవ్వొచ్చు లేదా న్యాయస్థాఽనాన్ని ఆశ్రయించవచ్చున్నారు. కేసులు పెట్టి అర్ధఽరాత్రి అదుపులోకి తీసుకొని అరెస్ట్ చూపించక పోవడం దారుణమన్నారు. అధికార పార్టీ నేతల అండతోనే అక్రమంగా అరెస్ట్‌లు చేశారని ఆరోపించారు. సీఎం చంద్రబాబు, డీజీపీ వెంటనే స్పందించి జర్నలిస్టులను బేషరతుగా విడుదల చేయాలని, అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
24 మంది జూదరుల అరెస్టు
అనకాపల్లి: మండలంలోని తుమ్మపాల గ్రామ వద్ద ఏలేరు కాలువ సమీపంలో జూదం ఆడుతుండగా 24 మందిని సోమవారం అదుపులోకి తీసుకున్నట్టు పట్టణ ఎస్‌ఐ ఎం.కె.జిలానీ తెలిపారు. వీరు బ్యాచ్‌లుగా ఆడుతుండగా పట్టుకున్నామన్నారు. 16 మంది బ్యాచ్ నుంచి రూ.23 వేలు, మిగిలిన వారి నుంచి రూ.10 వేల వంతున నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు.
రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు
అనకాపల్లి : మండలంలోని తుమ్మపాల గ్రామానికి చెందిన అప్పారావు (52) ఈ నెల 2న అదే గ్రామం వద్ద రోడ్డు దాటుతుండగా ద్విచక్ర వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన సంఘటనపై సోమవారం కేసు నమోదు చేశామని పట్టణ ట్రాఫిక్ సీఐ ఎం.వెంకటరమణ తెలిపారు. బాధితుని నుంచి అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.
కమలేష్ మృతదేహం జార్ఖండ్‌కు తరలింపు
అచ్యుతాపురం రూరల్ : అపార్ట్‌మెంట్‌పై నుంచి జారిపడి మృతి చెందిన కమలేష్ యాదవ్ (43)ను తన కుటుంబీకులకు అప్పగించారు. జార్ఖండ్‌కు చెందిన కమలేష్ యాదవ్ కుటుంబీకులు మృతదేహాన్ని తీసుకుని తమ సొంత రాష్ట్రమైన జార్ఖండ్‌కు తీసుకువెళ్లినట్లు పోలీసులు సోమవారం తెలిపారు.


