సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి బుధవారం ఆర్జిత సేవలు వైభవంగా జరిగాయి. ఉదయం 9.30 నుంచి నిత్యకల్యాణం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ బేడామండపంలో స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను వేంజేపచేశారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవాచనం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో కల్యాణం జరిపారు. ఉభయ దాతలకు కల్యాణ అక్షింతలు, ప్రసాదం, శేషవస్త్రంలను అందించారు.
ఘనంగా గరుడ సేవ
శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి గరుడ సేవ ఘనంగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని వెండి గరుడ వాహనంపై వేంజేపచేశారు. అష్టోత్తర శతనామావళి పూజ జరిపారు. భక్తులను గరుడ వాహనం చుట్టూ ప్రదక్షిణ చేయించారు. విశేష హారతులు అందించారు.


