అనకాపల్లి/చోడవరం: జిల్లా దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం అధ్యక్షునిగా వడ్డాది రమేష్(చోడవరం) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండలంలో కొత్తూరు పంచాయతీ శారదానగర్ శ్రీనివాస ఫంక్షన్ హాల్లో బుధవారం జరిగిన ఎన్నికల్లో జిల్లా గౌరవాధ్యక్షునిగా సున్నం చిదంబరస్వామి(నర్సీపట్నం), ప్రధాన కార్యదర్శి బొగ్గారపు వెంకట గున్నాజీరావు(అనకాపల్లి), ఉపాధ్యక్షులుగా డి.ఎస్.వి.జె.ఎన్.మురళీకృష్ణ (నక్కపల్లి), సహాయ కార్యదర్శిగా రనరం సన్యాసినాయుడు(నర్సీపట్నం), కోశాధికారిగా ఆర్లే ఉమామహేశ్వరరావు(యలమంచిలి), ఆర్గనైజింగ్ కార్యదర్శిగా శేఖర్‌మంత్రి శ్రీనివాసరావు (సబ్బవరం) కార్యవర్గ సభ్యులుగా కోట్ని గణేష్, సూదికొండ మాణిక్యాలరావు, ఒమ్మిడిపాటి వరప్రసాద్, జూరెడ్డి శ్రీరామూర్తి, బొబ్బిలి సన్యాసినాయుడుతో పాటు మరో తొమ్మిది మంది ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పెనుమాక వెంకట సుబ్బారావు, రాష్ట్ర కార్యదర్శి గాదె రవికుమార్, రాష్ట్ర కోశాధికారి అవ్వారు సత్యనారాయణ వ్యవహరించారు. ఈ సందర్బంగా వడ్డాది రమేష్ మాట్లాడుతూ పై కమిటీ రెండు సంవత్సరాలు ఉంటుందన్నారు. జిల్లాలో దస్తావేజుల లేఖరులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు చేస్తామన్నారు.


