వేసవి భానుడు సెగలు పుట్టిస్తున్నా, అల్లూరి జిల్లా మన్యం మాత్రం చల్లని మంచు దుప్పటిని కప్పుకుంటోంది. ఒకవైపు ఉదయం 8 గంటల వరకు దట్టంగా కురుస్తున్న పొగమంచు ఆహ్లాదాన్ని పంచుతుంటే, మరోవైపు ముందస్తుగానే వికసించిన మే ఫ్లవర్లు ప్రకృతి ప్రేమికులను కనువిందు చేస్తున్నాయి. మంచు ముసుగులో ఎర్రని పూల సోయగాలు మన్యం అందానికి మరింత వన్నె తెస్తున్నాయి. – సాక్షి, పాడేరు
పాడేరు–మినుములూరు రోడ్డులో దట్టంగా కురుస్తున్న పొగమంచు
వికసించిన మే ప్లవర్‌లు


