కొయ్యూరు: రాజేంద్రపాలెం పంచాయతీ సోలాబులో శుక్రవారం డీఆర్ సబ్ డిపోను ఏర్పాటు చేయడంతో జోగంపేట, సోలాబు గ్రామస్తుల రేషన్ కష్టాలు తీరాయి. గత కొన్ని నెలలుగా రేషన్ కోసం సోలాబు, జోగంపేట గిరిజనులు సుమారు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజేంద్రపాలెం వెళ్లాల్సి వస్తోంది. ఈ సమస్యపై గతంలో కొయ్యూరు పర్యటనకు వచ్చిన ఆర్డీవోకు స్థానిక గిరిజనులు విన్నవించారు. మరోవైపు, గిరిజనులు పడుతున్న ఇబ్బందులను వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు నర్సి కృష్ణ తహసీల్దారుతో పాటు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ నాయకులు మరియు ప్రజల విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన అధికారులు సోలాబులో డీఆర్ సబ్ డిపోను ఏర్పాటు చేశారు.దీనిపై వైఎస్సార్‌సీపీ నాయకుడు నర్సి కృష్ణ మాట్లాడుతూ.. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లగానే స్పందించి డిపోను ఏర్పాటు చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. గిరిజనుల కష్టాలను తీర్చిన అధికారులకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.


