గోపీనాథ్‌కు పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలుపుతున్న పీఆర్టీయూ శాఖ ఉపాధ్యాయులు
నర్సీపట్నం: ఏపీ జేఏసీ కో చైర్మన్‌గా పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు డి.గోపీనాథ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా పీఆర్టీయూ నాయకులు ఆయన్ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గోపీనాథ్ మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన డీఏ బకాయిలు, ఐఆర్, పీఆర్సీ ప్రకటన ప్రభుత్వం వెంటనే చేయాలని డిమాండ్ చేశారు. ఇతర సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తామన్నారు. పీఆర్టీయూ మండల అధ్యక్ష, కార్యదర్శులు ఎ.వరహాలనాయుడు, జి.వి.రమేష్, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు కె.వి.రమణ తదితరులు పాల్గొన్నారు.


