అనకాపల్లి టౌన్: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ సంయుక్త దాడులను తక్షణమే ఆపేయాలని భారత సాంస్కృతిక సహకార స్నేహ సంఘం జిల్లా సమితి (ఇస్కప్) డిమాండ్ చేసింది. స్థానిక శ్రామిక సదనంలో జరిగిన సమావేశంలో ప్రపంచ శాంతిని కోరుతూ యుద్ధంలో కన్నుమూసిన మానవాళికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇస్కప్ జాతీయ కౌన్సిల్ సభ్యుడు ఎ. మాధవరావు మాట్లాడుతూ అమెరికా అనుసరించే సామ్రాజవాద, దురాక్రమణ చర్యల్లో భాగంగానే ప్రపంచంలో శాంతి లేకుండా పోతుందన్నారు. కేవలం ఆయిల్ నిక్షేపాల కోసమే కుంటిసాకులతో ఈ దాడులకు తెగబడ్డాయన్నారు. ఒక దేశంపై మరొక దేశం దాడి చేయడం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనన్నారు. కార్యక్రమంలో ఇస్కప్ జిల్లా నేతలు విల్లూరి పైడారావు, దాడి శివరాం, మళ్ల చక్రవర్తి, బొడ్డేడ అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.


