వ్యవసాయ విద్యలో అద్భుత ప్రతిభ
రంపచోడవరం: వ్యవసాయ విద్యలో రంపచోడవరం గ్రామానికి చెందిన కాపారపు సుభాషిణి అత్యుత్తమ ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్ సాధించారు. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో ఉన్న మహారాణా ప్రతాప్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ అనుబంధ ’కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ అండ్ అప్లైడ్ సైన్సెస్’ నుంచి ఆమె ఎక్స్‌టెన్షన్ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ మేనేజ్‌మెంట్‌లో పీజీ (మాస్టర్స్) పూర్తి చేశారు. ఈనెల 22న రాజస్థాన్‌లో జరిగిన దీక్షాంతోత్సవ కార్యక్రమంలో ఆ రాష్ట్ర గవర్నర్ హరిభౌ కిసన్‌రావ్ బగాడే చేతుల మీదుగా సుభాషిణి గోల్డ్ మెడల్‌ను అందుకున్నారు.
వ్యవసాయ విస్తరణ, గ్రామీణాభివృద్ధిలో భాగంగా రైతులకు శాసీ్త్రయ సమాచారాన్ని సమర్థవంతంగా చేరవేసేందుకు ‘కృత్రిమ మేధ సాధనాలపై అవగాహన మరియు వినియోగం‘ అనే అంశంపై ఆమె తన పరిశోధనను పూర్తి చేశారు.డీన్ డాక్టర్ ధృతి సోలంకి నేతృత్వంలో, అడ్వైజరీ డాక్టర్ రాజశ్రీ ఉపాధ్యాయ మార్గదర్శకత్వంలో ఆమె విద్యాభ్యాసం కొనసాగింది. సుభాషిణి తల్లి రూతు వైఎస్సార్ సీపీజిల్లా మహిళా ఉపాధ్యక్షురాలిగా సేవలందిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గవర్నర్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకోవడం నా జీవితంలో గర్వకారణంగా నిలుస్తుందన్నారు. ప్రస్తుత వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ముఖ్యంగా కృత్రిమ మేధ ప్రాధాన్యతను నా పరిశోధన ప్రతిబింబిస్తుందని ఆమె పేర్కొన్నారు.


