
‘మా పంచాయతీలను జీకే వీధిలోనే కొనసాగించాలి’
గూడెంకొత్తవీధి: గాలికొండ, ఎ. ధారకొండ పంచాయతీలను గూడెంకొత్తవీధి మండలంలోనే కొనసాగించాలని సర్పంచ్‌లు కాకూరి బుజ్జిబాబు,ముర్ల సత్యవతిల ఆధ్వర్యంలో ఆయా గ్రామస్తులు శుక్రవారం పాడేరులో సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్‌కు వినతి పత్రం అందజేశారు.రెండు పంచాయతీలు గూడెంకొత్తవీధికి దగ్గరగా ఉన్నాయని పేర్కొన్నారు.కొత్తగా ధారకొండ కేంద్రంగా మరో మండాలన్ని ఏర్పాటు చేయాలని కొంతమంది డిమాండ్ చేస్తున్నారని, ఆ మండలంలో ఈ రెండు పంచాయతీలను కలపాలని కోరుతున్నారన్నారు. ఆ ప్రతిపాదనను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. గూడెంకొత్తవీధి మండలంలోనే తమ పంచాయతీలను కొనసాగించాలని వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు కంకిపాటి గిరిప్రసాద్,వైస్ సర్పంచ్‌లు మురళీ,చంటిబాబు,హరి తదితరులు కోరారు.