
పంట కాలువలో పడి మహిళ మృతి
పంట కాల్వలో తేలిన రాము మృతదేహం, మృతురాలు నడిగట్ల రాము (ఫైల్)
యలమంచిలి రూరల్: పొలం పనుల కోసం చేనుకు వెళ్లి వస్తున్న మహిళ పంట కాలువ దాతుతూ ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందిన ఘటన యలమంచిలి మండలం తురంగలపాలెం సమీపంలో చోటు చేసుకుంది. యలమంచిలి రూరల్ పీఎస్ పరిధి తురంగలపాలేనికి సమీపంలో నడిగట్ల అప్పారావు పంట పొలం, చేను ఉన్నాయి. రోజూ లాగానే గురువారం రాత్రి 7 గంటల సమయంలో చేనుకు వెళ్తున్న అప్పారావు భార్య నడిగట్ల రాము (50) చేను నుంచి ఇంటికి వెళ్లే క్రమంలో పంట కాల్వ దాటుతూ ప్రమాదవశాత్తు కాల్వలో జారిపడింది. ఎంత సేపైనా భార్య ఇంటికి రాకపోవడంతో భర్త, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అక్కడ వెతికినప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదు. చివరకు శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో రాము మృతదేహం పంట కాల్వలో తేలుతూ కనిపించింది. మృతురాలి భర్త అప్పారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ ఎం. ఉపేంద్ర తెలిపారు.

పంట కాలువలో పడి మహిళ మృతి