
పలు రైళ్ల రద్దు, మరికొన్ని రీ షెడ్యూల్
తాటిచెట్లపాలెం: వాల్తేర్ డివిజన్ పరిధి విజయనగరం వద్ద శుక్రవారం ఉదయం గూడ్స్ రైలు బోగీలు పట్టాలు తప్పడంతో విశాఖ నుంచి బయల్దేరాల్సిన పలు రైళ్లు రద్దు చేశారు. వాల్తేర్ డీఆర్‌ఎం సంఘటన స్థలానికి చేరుకుని యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులను పూర్తిచేయించారు. సాయంత్రానికి ఇరు వైపులా ట్రాక్‌లపై రైళ్లు రాకపోకలను పునరుద్ధరించారు. విజయనగరం–విశాఖపట్నం(67288) పాసింజర్, విశాఖపట్నం–పలాస–విశాఖపట్నం(67289/67290)పాసింజర్, విశాఖపట్నం–కోరాపుట్(58538) పాసింజర్, విశాఖపట్నం–బ్రహ్మపూర్(58532)పాసింజర్, బ్రహ్మపూర్–విశాఖపట్నం(18525)ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం–విజయనగరం(67287)పాసింజర్, విశాఖపట్నం–దుర్గ్(18530)ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం–దుర్గ్(22820) వందేభారత్ ఎక్స్‌ప్రెస్ శుక్రవారం రద్దు చేశారు. 30వ తేదీన కోరాపుట్–విశాఖపట్నం(58537) పాసింజర్, బ్రహ్మపూర్–విశాఖపట్నం(58531) పాసింజర్ రద్దు చేశారు. ఈ లైన్‌లో పలు రైళ్లను రీ షెడ్యూల్ చేశారు.