పెందుర్తి: భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా ఇంటి నుంచి వెళ్లిపోయిన మహిళ, ఆమె కుమారుడి కేసును పోలీసులు మూడేళ్ల తర్వాత ఛేదించారు. ఈ కేసు వివరాలను సీఐ సతీష్ కుమార్ వెల్లడించారు. బోరాడ సంతోష్, అతని భార్య నాగమణి, కుమారు డు నివాస్ పెందుర్తి పాపయ్యరాజు పాలెంలో నివసించేవారు. తరుచూ భార్యభర్తల మధ్య గొడవలు జరు గుతుండేవి. 2022 ఫిబ్రవరి 10న నాగమణి తన కొడుకును తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. మరుసటి రోజు సంతోష్ ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నాటి నుంచి పోలీసులు విస్తృతంగా గాలించారు. మూడేళ్ల తరువాత ఎట్టకేలకు పోలీసులు వారిని విశాఖలోని మద్దిలపాలెంలో గుర్తించారు. శుక్రవారం వారిద్దరినీ పెందుర్తి పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి కౌన్సెలింగ్ ఇచ్చి భర్త సంతోష్‌కు అప్పగించారు.