
సమస్యల పరిష్కారం మరింత వేగవంతం
● కలెక్టర్ దినేష్‌కుమార్
● పీజీఆర్‌ఎస్‌లో 121 అర్జీల స్వీకరణ
పాడేరు : ప్రజల నుంచి పలు సమస్యలపై స్వీకరిస్తున్న వినతులను క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశించారు. శుక్రవారం స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు వెల్లువెత్తాయి. కలెక్టర్ దినేష్‌కుమార్, సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్, డీఆర్వో పద్మలత, ఎస్‌డీసీ లోకేశ్వరరావు ప్రజలనుంచి 121 వినతులను స్వీకరించారు. అర్జీదారులు మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని కోరారు. అర్జీదారులు తమ వినతులను నమోదు చేసుకునేందుకు meekosamap.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవశాయశాఖ అధికారి ఎస్‌బీఎస్ నంద్, డీఆర్డీఏ పీడీ మురళి, డ్వామా పీడీ విద్యాసాగర్, ఆర్‌అండ్‌బీ ఈఈ బాలసుందరబాబు, ఐసీడీఎస్ పీడీ ఝాన్షీ రామ్ పడాల్ పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారం మరింత వేగవంతం