
భీరంను జి.మాడుగుల మండంలోనే కొనసాగించాలి
జి.మాడుగుల: భీరం పంచాయతీని జి.మాడుగుల మండలంలోనే కొనసాగించాలని సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులు,పీసా కమిటీ ఉపాధ్యక్షుడు, గ్రామస్తులు తీర్మానించారు. మండలంలో భీరం పంచాయతీ కేంద్రంలో శుక్రవారం వారు సమావేశమయ్యారు. మద్దిగరువు కేంద్రంగా మండలం ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రతిపాదనను కొందరు తెరపైకి తీసుకువస్తున్నారని చెప్పారు. మద్దిగరువు ప్రాంతానికి చెందిన కొంతమంది తమ అభిప్రాయం తీసుకోకుండా భీరం పంచాయతీని కలుపుకొని మండల ఏర్పాటుకు ఆందోళనలు చేస్తున్నారని తెలిపారు. మండలాల పునర్విభజన జరిగితే భీరం పంచాయతీని జి.మాడుగుల మండలంలోనే కొనసాగించాలని వారు కోరారు. అనంతరం ఎంఆర్వో రాజ్‌కుమార్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రత్నకుమారి, వైస్ సర్పంచ్ సన్యాసయ్య తదితరులు పాల్గొన్నారు.