
22న కానిస్టేబుల్ అభ్యర్థులకు సర్టిఫికెట్ల పరిశీలన
వీధి కుక్కల దాడిలో11 మేక పిల్లల మృతి
ఎటపాక: వీధి కుక్కల దాడిలో 11 మేక పిల్లలు మృతి చెందాయి. మంగళవారం మండలంలోని లక్ష్మీపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బుద్దుల భద్రయ్య ఉదయం మేక పిల్లలను ఇంటి వద్ద మిగతా మేకలను మేతకు తీసుకువెళ్లాడు. అయితే ఇంటి వద్ద ఎవరూ లేని సమయంలో వీధి కుక్కలు మేక పిల్లలపై దాడి చేసి చంపేశాయి. దీనివల్ల సుమారు రూ.లక్ష వరకు నష్టం వాటిల్లింది.
ఆరిలోవ (విశాఖ): ఉమ్మడి విశాఖ జిల్లాల్లో ఇటీవల కానిస్టేబుల్ (సివిల్, ఏపీఎస్పీ) ఉద్యోగాలకు ఎంపికై న అభ్యర్థులకు ఈ నెల 22న
సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించనున్నారు. అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఈ విషయాన్ని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
సర్టిఫికెట్ల పరిశీలన విశాఖలోని విశాలాక్షి నగర్, కై లాసగిరిలో ఉన్న ఆర్మడ్ రిజర్వ్ పోలీస్ గ్రౌండ్‌లో జరుగుతుంది. అభ్యర్థులు ఉదయం 7 గంటల కల్లా అక్కడకు చేరుకోవాలని సూచించారు. అభ్యర్థులు ఎంపిక ప్రక్రియ సమయంలో సమర్పించిన జిరాక్స్ కాపీలకు సంబంధించిన అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లను తప్పనిసరిగా వెంట తీసుకురావాలని ఆయన కోరారు.