
వరద గండం
తగ్గినట్టే తగ్గి..
గోదావరికి వరద గండం తప్పదా.. ఇవే అనుమానాలు పరివాహకప్రాంత ప్రజల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. ఈ ఏడాది జూలైలో వరద ముప్పు లేనప్పటికీ ఆగస్టులో వరద ముప్పు తప్పదనే సంకేతాలు కనిపిస్తుండటంతో భయం గుప్పెట్లో గడుపుతున్నారు. ఇప్పటివరకుసంభవించిన వరదల్లో ఎక్కువశాతం ఆగస్టులోనే సంభవించినట్టుగా కేంద్ర జలవనరులశాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గత 49 సంవత్సరాల్లో ఆగస్టు నెలలో అతిపెద్ద వరదలుసంభవించడం గమనార్హం.
విలీన మండలాలకు
గత 49 ఏళ్లలో ఆగస్టులోనే గోదావరికి 12 సార్లు తాకిడి
715.2 ఎంఎం వర్షపాతం నమోదు
● కేంద్ర జలవనరుల శాఖ హెచ్చరికలు
● తీర ప్రాంత ప్రజల్లో
భయం భయం
● ఇదే నెలలో ఐదింటిలో
మూడుసార్లు పెద్ద వరదలు
● మళ్లీ నష్టం తప్పేట్టు లేదని
సర్వత్రా ఆందోళన
చింతూరు: గోదావరి, శబరి నదుల నీటిమట్టాలు తగ్గినట్టే తగ్గి మంగళవారం సాయంత్రం నుంచి తిరిగి పెరుగుతున్నాయి. సోమవారం రాత్రి వరకు పెరిగిన గోదావరి, శబరి నదులు అర్ధరాత్రి నుంచి తగ్గుముఖం పట్టాయి. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదనీటితో శబరినది తిరిగి మధ్యాహ్నం నుంచి, గోదావరి సాయంత్రం నుంచి పెరుగుతోంది. గోదావరి, శబరినదుల వరద కారణంగా వరుసగా రెండోరోజు కూడా చింతూరు, కూనవరం, వీఆర్‌పురం మండలాల్లో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మంగళవారం రాత్రికి భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 36.5 అడుగులు, చింతూరు వద్ద శబరినది నీటిమట్టం 33 అడుగులుగా నమోదైంది. తెలంగాణలో పలు ప్రాజెక్టుల నుంచి దిగువకు నీరు విడుదల చేస్తున్న నేపథ్యంలో బుధవారం రాత్రికి భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి 43 అడుగులకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా సమాచారం.
● కుయిగూరువాగు వరద కారణంగా ఆంధ్రా–ఒడిశా జాతీయ రహదారి–326పై నీరు నిలిచిపోవడంతో ఒడిశా వెళ్లే వాహనాలు చింతూరులోనే నిలిచిపోయాయి. చింతూరు మండలంలో సోకిలేరు, చంద్రవంక, జల్లివారిగూడెం, కుయిగూరు, చీకటివాగుల వరద ఇంకా రహదారులపైనే నిలిచిఉంది. దీంతో చింతూరు, వీఆర్‌పురం మండలాల మధ్య రెండోరోజు కూడా రవాణా స్తంభించింది. దీంతోపాటు చింతూరు మండలంలోని ముకునూ రు, నర్సింగపేట, రామన్నపాలెం, బొడ్రాయిగూడెం, చినశీతనపల్లి, పెదశీతనపల్లి, కొండపల్లి, తిమ్మిరిగూడెం, ఏజీకొడేరు, ఉలుమూరు, మల్లెతోట, కుమ్మూరు, కుయిగూరు, కల్లేరు, సూరన్నగొంది, మదుగూరు గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలు, వరద పరిస్థితుల కారణంగా బుధవారం చింతూరు ఐటీడీఏలో జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఐటీడీఏ పీవో అపూర్వభరత్ ఓ ప్రకటనలో తెలిపారు.
సాక్షి,పాడేరు: జిల్లా వ్యాప్తంగా వర్షాలు కొనసాగుతున్నాయి. జిల్లా కేంద్రం పాడేరుతోపాటు పరిసర ప్రాంతాల్లో మంగళవారం ఓ మోస్తరు వర్షం కురిసింది. మారుమూల ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధాన గెడ్డలు, వాగుల్లో వరద ఉధృతి నెలకొంది. గిరిజనులు గెడ్డలు దాటకుండా అధికార యంత్రాంగం అప్రమత్తం చేసింది. జిల్లా వ్యాప్తంగా మంగళవారం 715.2మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మారేడుమిల్లిలో 115.2, చింతపల్లిలో 52.8,కూనవరంలో 48.8, అరకులోయలో 43.8, ముంచంగిపుట్టులో 40.6, దేవీపట్నంలో 36.4, చింతూరులో 35.2, పెదబయలులో 33.2, జి.మాడుగులలో 31.4, హుకుంపేటలో 30.6, వీఆర్‌పురంలో 32.6, వై.రామవరంలో 29.2, ఎటపాకలో 26.4, డుంబ్రిగుడలో 26.4, అనంతగిరిలో 25.2, పాడేరులో 19.2, గూడెంకొత్తవీధిలో 18.6, రంపచోడవరంలో 18.6, అడ్డతీగలలో 16.2, గంగవరంలో 14.6, కొయ్యూరులో 14, రాజవొమ్మంగిలో 6.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
మళ్లీ పెరుగుతున్న గోదావరి,
శబరి నదుల నీటిమట్టాలు
చింతూరు డివిజన్‌లో రెండో రోజు
నిలిచిన రాకపోకలు
ఎటపాక: గోదావరి వరదలు సంభవించినప్పుడల్లా తీర ప్రాంతం వెంబడి ఉన్న ఎటపాక, కూనవరం, వీఆర్‌పురం, చింతూరు మండలాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంట పొలాలు మునిగిపోతున్నాయి. జలదిగ్బంధంలో గ్రామాలు చిక్కుకోవడంతో వ్యవస్థ స్తంచించి జనజీనవం అస్తవ్యస్తమవుతోంది.
ఏటా జూలై నుంచి అక్టోబర్ వరకు గోదావరి వరదల ముప్పు పొంచి ఉంటుంది. ఈ ఏడాది జూలైలో అత్యధికంగా 41 అడుగుల వరకూ మాత్రమే నీటిమట్టం నమోదైంది. ఇప్పడు వరద పెరిగే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ హెచ్చరికలు జారీ చేసింది. సోమవారం సాయంత్రానికి 38 అడుగులు ఉన్న వరద బుధవారం నాటికి 43 అడుగులు దాటుతుందని ఇప్పటికే ప్రకటించింది.
గణాంకాలిలా..
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టాన్ని అడుగుల్లో కొలుస్తారు. ఇందుకోసం ఇక్కడ కేంద్ర జల సంఘ కార్యాలయం (సీడబ్ల్యూసీ) 1976లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసింది. అప్పటి నుంచి మాత్రమే ఇక్కడ గోదావరి వరదలకు సంబంధించిన నివేదికలు అందుబాటులో ఉన్నాయి.
భద్రాచలం వద్ద 43 అడుగుల నీటిమట్టం నమోదైతే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అవుతుంది. ఈ సమయంలో గోదావరి నీరు వాగుల ద్వారా ఎగదన్నుతుంది. విలీన మండలాల్లో లోతట్టు ప్రాంతాలు సుమారు 30 వరకు ముంపునకు గురవుతాయి.
నీటిమట్టం 48 అడుగులకు చేరితే రెండవ ప్రమాద హెచ్చరిక జారీ అవుతుంది. భద్రాచలం కూనవరానికి రహదారి సౌకర్యం బంద్ అవుతుంది. వీఆర్‌పురం, చింతూరు, వీఆర్‌పురం, ఎటపాక మండలాల్లో సుమారు 80 గ్రామాలకు రాకపోకలు బంద్ అవుతాయి.
నీటిమట్టం 53 అడుగులకు చేరితే మూడవ ప్రమాద హెచ్చరిక జారీ అవుతుంది. వీఆర్‌పురం మండలంలో 39, ఎటపాక మండలంలో 7, కూనవరం మండలంలో 18 గ్రామాల చుట్టూ నీరు చేరుతుంది.
ఇప్పటి వరకు అత్యధికంగా 1986లో 75.6 అడుగులు, 2002లో 71.3, 1990లో 70.8, 2006లో 66.9, 1976లో 63.9 అడుగులు వరదలు వచ్చినట్లు సీడబ్ల్యూసీ గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఈ ఐదింటిలో అత్యధికంగా మూడు సార్లు ఆగస్టులోనే వచ్చాయి.
మూడు నెలలూ కీలకం
జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లోనే గోదావరికి వరద పోటెత్తుతుంది. ఇప్పటి వరకు జూన్‌లో రెండు సార్లు అత్యధికంగా 1976 63.9 అడుగులు, 1979లో 44.7 అడుగులు నమోదైంది.
జూలై నెలలో ఎనిమిది సార్లు 53 అడుగులు దాటి వరదలు వచ్చాయి. ఇందులో 2022లో అత్యధికంగా 71.3 అడుగులు నమోదైంది.
సెప్టెంబర్‌లో ఆరు సార్లు గోదావరికి వరదలు రాగా, ఇందులో 4 సార్లు మూడోప్రమాద హెచ్చరిక దాటి నీటి మట్టం నమోదైంది. అక్టోబర్‌లో 1995లో మాత్రమే 57.6 అడుగులు నీటిమట్టం నమోదైంది.
గోదావరి ఇప్పటివరకు 21సార్లు మూడో ప్రమాద హెచ్చరిక దాటి వరద ఉధృతి నెలకొంది. ఆగస్టులోనే 12 సార్లు వరదలు పోటెత్తాయి. ఇప్పటివరకు గోదావరికి ప్రమాదకర స్థాయిలో వరద సంభవించింది ఆగస్టు నెలలోనే. 1986లో 75.6 అడుగుల మేర నీటిమట్టం నమోదు అవడంతో గోదావరి నదీ పరివాహక ప్రాంతంలోని 14 మండలాల్లో బీభత్సం సృష్టించింది. భద్రాద్రి రామయ్య పాదాలను గోదారమ్మ తాకినట్లుగా చెబుతున్న వరదలు కూడా ఆగస్టులోనే కావటం గమనార్హం.
ఏజెన్సీలో వర్షాలకు ఉధృతంగా ప్రవహిస్తున్న మత్స్యగెడ్డ

వరద గండం

వరద గండం

వరద గండం

వరద గండం

వరద గండం