
అడ్డతీగల: వైఎస్సార్‌సీపీ అరకు పార్లమెంట్ సమన్వయకర్త ప్రస్తుత పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్ళ భాగ్యలక్ష్మి సోమవారం రాత్రి రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మిని, ఎమ్మెల్సీ అనంతబాబును మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ మేరకు ఎల్లవరంలోని ఎమ్మెల్సీ అనంతబాబు కార్యాలయంలో ఇరువురు నేతలను భాగ్యలక్ష్మి కలిశారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయానికి సమిష్టిగా కృషి చేసి మరలా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో సంక్షేమ సర్కారుని తెచ్చుకోవాలని నేతలు నిర్ణయించారు.
రంపచోడవరం నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. కొయ్యూరు ఎంపీపీ బడుగు రమేష్, కొయ్యూరు మండల పార్టీ అధ్యక్షులు జల్లి బాబులు, జేసీఎస్ కన్వినర్ సుధాకర్, నాయకులు సత్తిబాబు పాల్గొన్నారు.