ఆదిలాబాద్టౌన్: తమకు ఉద్యోగ భద్రతతో పాటు కనీస వేతనాలు అమలు చేయాలనే డి మాండ్లతో ఎన్హెచ్ఎం ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు నెల రోజులుగా చేస్తున్న స మ్మెను ఎట్టకేలకు విరమించారు. కుటుంబ సంక్షేమ శాఖ రాష్ట్ర కమిషనర్, ఎన్హెచ్ఎం ఎండీతో రాష్ట్ర ఎన్హెచ్ఎం జేఏసీ ప్రతినిధులు శుక్రవారం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. ఈమేరకు సమ్మె విరమించి విధుల్లో చేరుతున్నట్లుగా డీఎంహెచ్వో సాధనకు శనివారం నోటీసు అందజేశారు. ప్రభుత్వ లిఖిత పూర్వక హామీ మేరకు తాత్కాలికంగా విరమిస్తున్నట్లుగా ఉద్యోగులు పేర్కొన్నారు. జిల్లాలోని 478 మంది విధుల్లో చేరుతున్నట్లుగా వెల్లడించారు.


