ప్రణాళికాబద్ధంగా చదవాలి | - | Sakshi
Sakshi News home page

ప్రణాళికాబద్ధంగా చదవాలి

Nov 15 2026 1:38 PM | Updated on Nov 15 2026 1:38 PM

● ఎస్పీ అఖిల్‌ మహాజన్‌

ఆదిలాబాద్‌టౌన్‌: పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు ప్రణాళికాబద్ధంగా చదివితే లక్ష్యం సాధించవచ్చని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అన్నారు. జిల్లా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో డీటీసీలో ఎస్సై, కా నిస్టేబుల్‌ ప్రిలిమనరీ పరీక్షలకు 60 రోజుల పాటు నిర్వహించిన ఉచిత శిక్షణ తరగతులు శనివారంతో ముగిశాయి. 300 మంది శిక్షణ పొందారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, సమయాన్ని వృథా చేయకుండా రివిజన్‌తో పాటు ప్రీవియస్‌ పేపర్లు ప్రాక్టీస్‌ చేయాలని సూచించారు. ఇందులో సీఐ నాగరాజు, ఆర్‌ఐ వెంకటి, అధ్యాపకులు ప్రసాద్‌, వివేక్‌, ఫనీంద్ర, రమణగౌడ్‌, సాయికృష్ణ, శంకర్‌, రమేశ్‌, సమీర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement