నేటి నుంచి రాష్ట్రస్థాయి స్విమ్మింగ్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి రాష్ట్రస్థాయి స్విమ్మింగ్‌ పోటీలు

Nov 15 2026 12:56 PM | Updated on Nov 15 2026 12:56 PM

ఆదిలాబాద్‌: స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ (ఎస్జీఎఫ్‌) ఆదిలాబాద్‌ ఆధ్వర్యంలో నేటి నుంచి 14 ఏళ్లలోపు బాలబాలికలకు రాష్ట్రస్థాయి స్విమ్మింగ్‌ పోటీలు నిర్వహించనున్నారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలోని డీఎస్‌ఏ స్విమ్మింగ్‌ పూల్‌లో ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. రాష్ట్రంలోని 10 ఉమ్మడి జిల్లాల నుంచి సుమారు 400 మందికి పైగా క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొననున్నారు. క్రీడాకారులకు భోజన సౌకర్యంతోపాటు బాలురు, బాలికలకు వేర్వేరుగా బస ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్జీఎఫ్‌ జిల్లా కార్యదర్శి అద్దె రామేశ్వర్‌ తెలిపారు. రాష్ట్ర ఎస్జీఎఫ్‌ నుంచి అబ్జర్వర్‌తోపాటు టెక్నికల్‌ అధికారులు పోటీల నిర్వహణను పర్యవేక్షించనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం జిల్లాకు చెందిన సుమారు 40 మంది వ్యాయామ ఉపాధ్యాయుల సేవలను వినియోగించుకోనున్నట్లు వెల్లడించారు. పోటీల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement