● జిల్లాలో కొనసాగుతున్న భూ రీసర్వే ● తొలి విడతలోని 10 గ్రామాల్లో పూర్తి ● మందకొడిగా సా..గుతున్న ప్రక్రియ ● శాశ్వత పరిష్కారంపై రైతుల ఆశలు | - | Sakshi
Sakshi News home page

● జిల్లాలో కొనసాగుతున్న భూ రీసర్వే ● తొలి విడతలోని 10 గ్రామాల్లో పూర్తి ● మందకొడిగా సా..గుతున్న ప్రక్రియ ● శాశ్వత పరిష్కారంపై రైతుల ఆశలు

Nov 14 2026 1:05 AM | Updated on Nov 14 2026 1:05 AM

● జిల్లాలో కొనసాగుతున్న భూ రీసర్వే ● తొలి విడతలోని 10 గ్రామాల్లో పూర్తి ● మందకొడిగా సా..గుతున్న ప్రక్రియ ● శాశ్వత పరిష్కారంపై రైతుల ఆశలు

సాక్షి, ఆదిలాబాద్‌: భూవివాదాలకు శాశ్వత పరిష్కా రం చూపే దిశగా జిల్లా వ్యాప్తంగా రీసర్వే కొనసాగుతోంది. అయితే, భూవివాదాలకు శాశ్వత పరిష్కా రం లభిస్తుందా.. లేదా అనే విషయంలోనే రైతులు, భూయజమానుల్లో సందిగ్ధం నెలకొంది. రాష్ట్రంలో దాదాపు 125 ఏళ్ల కిందట సమగ్ర భూ సర్వే ప్రక్రి య నిర్వహించారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ సర్కారు భూ రీసర్వేకు ఆదేశించిన విషయం తెలిసిందే. జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ గ్రామాల్లో దశలవారీగా రీసర్వే నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూ పొందించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రెవె న్యూ రికార్డులను ప్రామాణికంగా తీసుకుంటూ స ర్వేయర్లు డీజీపీఎస్‌ రోవర్లు, జియో–కోఆర్డినేట్‌ లాంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో భూ ముల సరిహద్దులను నిర్ధారిస్తున్నారు. సర్వే వేగాన్ని మరింత పెంచేందుకు ఇప్పటికే ఉన్న రోవర్లకు అదనంగా మరిన్ని ప్రభుత్వం సమకూర్చబోతోంది.

అభ్యంతరాలకు అవకాశం

సర్వే పూర్తయిన గ్రామాల్లో ప్రతీ భూకమతానికి ఆధార్‌ తరహాలో ప్రత్యేక గుర్తింపు సంఖ్య అయిన భూధార్‌ నంబర్ల కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. సర్వే పూర్తయిన తర్వాత భూ యజమానులకు తప్పనిసరిగా నోటీసులు జారీ చేసి, అభ్యంతరాల నమోదుకు అవకాశం కల్పిస్తున్నారు.

హద్దుల వివాదాలకు తెరపడేనా?

నిజాం కాలం తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న తొలి సమగ్ర భూ సర్వే ఇదేనని ప్రభుత్వం చెబుతోంది. తరతరాల హద్దుల వివాదాలు, రికార్డుల తప్పుల ను సరిచేసేందుకు సర్వే శాశ్వత పరిష్కారం చూపుతుందని ప్రజలకు వివరిస్తోంది. సర్వే తర్వాత ఇచ్చే భూదార్‌ నంబర్‌తో కలిగే భద్రతపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని అధికారులకు సూచిస్తోంది. సర్వే వివరాలపై అభ్యంతరాలుంటే ఎక్కడ.. ఎలా ఫిర్యాదు చేయాలి? నోటీసులు జారీ విధానంగురించి జనాలకు అధికారులు వివరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement