అసాంఘిక చర్యలను అరికట్టాలి | - | Sakshi
Sakshi News home page

అసాంఘిక చర్యలను అరికట్టాలి

Nov 14 2026 12:59 AM | Updated on Nov 14 2026 12:59 AM

● ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ ● పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో నేర సమీక్ష ● ఉట్నూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మొబైల్‌ హ్యాకింగ్‌ ద్వారా ఓ బాధితుడి బ్యాంక్‌ ఖాతా నుంచి రూ.21వేల నగదు ఖాళీ అయ్యాయి. ● ఆదిలాబాద్‌రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ వ్యక్తి వాట్సాప్‌ ద్వారా జీపీయూ కొనుగోలు పేరిట రెండు విడతల్లో రూ.3,500 చెల్లించగా అతడికి సదరు వస్తువు పంపకుండా ఆన్‌లైన్‌ షాపింగ్‌ నిర్వాహకులు మోసగించారు. ● ఉట్నూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ముద్ర లోన్‌ ఇప్పిస్తామని నమ్మించి ఒకరిని ఈఎంఐ పేరుతో నిందితులు మొదట రూ.8,975, మరోసారి రూ.12,500 లోన్‌ఫ్రాడ్‌ చేశారు. ● వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఒకరికి లండన్‌ నుంచి నగలు, బహుమతులు పంపిస్తామని నమ్మించి పార్సిల్‌ చార్జీల పేరిట రూ.లక్షా 11వేల 200 వసూలు చేసి మోసం చేశారు. ● తలమడుగు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆన్‌లైన్‌ ఆర్డర్లు పూర్తి చేస్తే కమీషన్‌ వస్తుందని నమ్మించి పలు లావాదేవీల ద్వారా రూ.2006 చెల్లింపులు చేయించుకుని మరిన్ని డబ్బులు చెల్లించాలని ఒకరిని ఒత్తిడి చేసిన ఘటనపై కేసు నమోదైంది.

ఆదిలాబాద్‌టౌన్‌: అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా రూపుమాపాలని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ ఆదేశించారు. శుక్రవారం పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లోని సమావేశ మందిరంలో నెలవారీ నేర సమీక్ష నిర్వహించి మాట్లాడారు. రౌడీషీటర్లు, సస్పెక్ట్‌ షీటర్ల కదలికలపై నిఘా కొనసాగించాలని ఆదేశించారు. డయల్‌ 100, బ్లూకోల్ట్స్‌ సిబ్బందితో గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని, ప్రతీ గ్రామం, పట్టణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా ప్రజలను ప్రోత్సహించాలని సూచించారు. సైబర్‌క్రైమ్‌ బాధితులకు డబ్బులు తిరిగి అందించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. ఎప్పటికప్పుడు రికార్డులను నవీకరించాలని, కోర్టు డ్యూటీ అధికారులతో ప్రతీవారం సమీక్షించాలని సూచించారు. అదనపు ఎస్పీ మౌనిక, ఏఎస్పీ రుత్విక్‌సాయి కొట్టే, డీఎస్పీ జీవన్‌రెడ్డి తదితరులున్నారు.

సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా వ్యవహరించాలని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ సూచించారు. పోలీస్‌ కార్యాలయంలో వారం రోజుల్లో జిల్లాలో నమోదైన 24 సైబర్‌ ఫిర్యాదుల వివరాలు వెల్లడించారు. సైబర్‌ మోసానికి గురైతే 1930కు ఫిర్యాదు చేయాలని సూచించారు. గుర్తు తెలియని వ్యక్తులు పంపే లింక్‌లను క్లిక్‌ చేయవద్దని, అనుమానాస్పద యాప్‌లను ఇన్‌స్టాల్‌ చేయవద్దని తెలిపారు. బ్యాంక్‌ ఖాతా వివరాలు, ఓటీపీలు, యూపీఐ పిన్‌లను వెల్లడించవద్దని, ఆన్‌లైన్‌లో వస్తువులు కొనుగోలు చేసే సమయంలో వివరాలు పరిశీలించి చెల్లింపులు చేయాలని సూచించారు.

వారం రోజుల్లో నమోదైన కేసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement