● వ్యాపార సంస్థల నుంచి వసూలు ● నిర్ణయించిన మున్సిపల్‌ కౌన్సిల్‌ ● స్వచ్ఛతకు పెద్దపీట వేస్తున్న బల్దియా | - | Sakshi
Sakshi News home page

● వ్యాపార సంస్థల నుంచి వసూలు ● నిర్ణయించిన మున్సిపల్‌ కౌన్సిల్‌ ● స్వచ్ఛతకు పెద్దపీట వేస్తున్న బల్దియా

Nov 14 2026 12:59 AM | Updated on Nov 14 2026 12:59 AM

● వ్యాపార సంస్థల నుంచి వసూలు ● నిర్ణయించిన మున్సిపల్‌ కౌన్సిల్‌ ● స్వచ్ఛతకు పెద్దపీట వేస్తున్న బల్దియా

‘యూజర్‌’పై నజర్‌

కైలాస్‌నగర్‌: ఆదిలాబాద్‌ పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకు బల్ది యా ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటివరకు ఉచి త చెత్త సేకరణ సేవలు వినియోగించుకున్న వ్యాపా ర సంస్థల నుంచి ప్రత్యేకంగా యూజర్‌ చార్జీలు వసూలు చేయాలని మున్సిపల్‌ కౌన్సిల్‌ నిర్ణయించింది. చెత్త ఉత్పత్తి, దుకాణాల సామర్థ్యానికి అనుగుణంగా రూ.వెయ్యి నుంచి రూ.3వేల వరకు చార్జీ లు వసూలు చేస్తోంది. పట్టణంలో 4,895 వ్యాపార సంస్థలు ఉండగా, బల్దియాకు నెలకు రూ.10లక్షల నుంచి రూ.15లక్షల అదనపు ఆదా యం సమకూరనుంది. ఈ నిర్ణయం పట్టణ సచ్ఛతకు దోహదపడనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వ్యాపార సంస్థల నుంచి కూడా సానుకూలత వ్యక్తం కావడం మున్సిపాలిటీకి కలిసి వచ్చినట్లయింది.

ఇదీ అసలు ఉద్దేశం

ఆదిలాబాద్‌ పట్టణం క్రమంగా విస్తరిస్తుండటంతో పాటు రోజురోజుకూ వ్యాపార, వాణిజ్య సంస్థలూ పెరుగుతున్నాయి. దీంతో పాటు చెత్త ఉత్పత్తి కూ డా అధికమవుతోంది. ప్రధానంగా కిరాణా దుకాణా లు, హోటళ్లు, రెస్టారెంట్లు, వస్త్ర దుకాణాలు, ఇతర వాణిజ్య సముదాయాల నుంచి నిత్యం పెద్దమొత్తంలో వ్యర్థాలు వెలువడుతున్నాయి. వీటిని ప్రతీరోజు సేకరించి డంప్‌యార్డుకు తరలించడం బల్దియాకు సవాల్‌గా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో చెత్త సేకరణ, రవాణా, పారిశుద్ధ్య నిర్వహణ ఖర్చులు కొంతమేరకు సమకూర్చుకునేందుకు గాను యూజ ర్‌ చార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement