బాసర: నిర్మల్ జిల్లా బాసరలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీజ్ఞానసరస్వతీ అమ్మవారి ఆలయ పునర్నిర్మాణంలో కీలక ఘట్టం శుక్రవారం ఆవిష్కృతమైంది. కృష్ణశిలలతో ప్రధాన గర్భాలయ నిర్మాణ పనులకు ఉదయం 9.15 గంటలకు మూల నక్షత్ర యుక్త శుభ ముహూర్తంలో వైదిక బృందం శాస్త్రోక్తంగా శ్రీకారం చుట్టింది. శృంగేరి జగద్గురువుల ఆజ్ఞ మేరకు, ఆగ మ శాస్త్ర నియమాల ప్రకారం.. దేవస్థాన స్థానాచా ర్యులు, ప్రధానార్చకులు ఈ పవిత్ర కార్యక్రమం ని ర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి అంజ నాదేవి సమక్షంలో, గర్భాలయ నిర్మాణదాతలు సూ రపనేని సునంద్, పద్మప్రియ దంపతుల చేతుల మీ దుగా ప్రథమ కృష్ణ శిలాస్థాపన పూజ జరిపించారు.
నిర్మాణం ప్రారంభం
ఇప్పటివరకు పాత నిర్మాణాల తొలగింపు, బేస్ మెంట్ పనులు పూర్తయ్యాయని ఈవో అంజనాదేవి తెలిపారు. శుక్రవారం నుంచి కృష్ణశిలలతో ప్రధాన గర్భాలయ నిర్మాణ పనులు అధికారికంగా ప్రారంభించినట్లు వెల్లడించారు. ఆలయ ప్రాచీన సంప్రదాయాలు ఉట్టిపడేలా, భవిష్యత్లో భక్తులకు మరింత ఆధ్యాత్మిక వైభవాన్ని అందించేలా ఈ నిర్మాణం సాగుతుందని స్థపతి, ఆర్కిటెక్చర్ నిపుణులు పేర్కొన్నారు. కార్యక్రమంలో దేవస్థాన అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, స్థపతులు, శిల్పులు, అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


