కార్మికశాఖ కార్యాలయం ఎదుట ధర్నా | - | Sakshi
Sakshi News home page

కార్మికశాఖ కార్యాలయం ఎదుట ధర్నా

Nov 14 2026 12:59 AM | Updated on Nov 14 2026 12:59 AM

ఆదిలాబాద్‌రూరల్‌: కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం జిల్లా కార్మికశాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎస్‌ బిల్డింగ్‌, కన్‌స్ట్రక్షన్‌ వర్కర్స్‌ యూనియన్‌ జనరల్‌ సెక్రటరీ గాజంగుల రాజు మాట్లాడారు. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న భవన నిర్మాణ సంక్షేమ బోర్డును ప్రభుత్వం నిర్వీర్యం చేసే కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఖాళీగా ఉన్న ఏఎల్వో, డీసీఎల్‌ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, కార్మికుల అడ్డాల వద్ద షెల్టర్లు నిర్మించాలని, భవన నిర్మాణ కార్మికులకు హెల్త్‌ కార్డులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 50 ఏళ్లు దాటినా భవన కార్మికులకు పెన్షన్‌ ఇవ్వాలని, సీఎస్‌సీ టెస్టులు రద్దు చేయాలని, సంక్షేమ బోర్డులో కార్మిక సంఘాలకు ప్రతినిధ్యం కల్పించాలని కోరారు. మిగతా సమస్యలు వివరించి పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కార్మిక సంఘం నాయకులు బదార్‌, మహేందర్‌, ఆశన్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement