సాత్నాల: మండలంలోని మేడిగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థి సీడం అన్వేశ్ ప్రేరణ కార్యక్రమంలో ప్రతిభ కనబరి చాడు. జిల్లా కేంద్రంలో గతంలో నిర్వహించిన వ్యాసరచన పోటీలో ప్ర థమ స్థానంలో నిలిచాడు. ఇతడి ప్రతిభను గు ర్తించిన మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ ఇండియా సభ్యులు ప్రభుత్వ ఖర్చులతో ప్రధాని నరేంద్ర మోదీ చదువుకున్న గుజరాత్ రాష్ట్రంలోని వార్డ్ నగర్ పాఠశాలలో జనవరి 3నుంచి 9వరకు నిర్వహించే వివిధ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కల్పించారు. వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలు, సృజనాత్మకత, దేశభక్తి తదితర అంశాలపై అవగాహన పెంపొందించేందుకు ఈ అవకాశం పొందాడు. తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించడం గర్వకారణంగా ఉందన్న అన్వేశ్ తన ఎదుగుదలకు సహకరించిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు.


