రైతుల పంట రుణాల రీషెడ్యూల్‌కు చర్యలు | - | Sakshi
Sakshi News home page

రైతుల పంట రుణాల రీషెడ్యూల్‌కు చర్యలు

Nov 14 2026 1:05 AM | Updated on Nov 14 2026 1:05 AM

● కలెక్టర్‌ రాజర్షిషా ● సాంగిడిలో టీజీబీ బ్రాంచ్‌ ప్రారంభం ● కలెక్టరేట్‌లో పిల్లల ప్రత్యేక ప్రజావాణి పోస్టర్‌ ఆవిష్కరణ

ఆదిలాబాద్‌(బేల): కరువు పరిస్థితుల నేపథ్యంలో రైతులు బ్యాంకుల ద్వారా పొందిన పంట రుణా లను రీషెడ్యూల్‌ చేసేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని కలెక్టర్‌ రాజర్షి షా పేర్కొన్నారు. శుక్రవారం బేల మండలం సాంగిడి గ్రా మంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ నూతన శా ఖను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రైతులను ఆదుకునేందుకు బేలను కరువు మండలంగా ప్రకటించా మని తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు క్షే త్రస్థాయిలో పంట నష్టంపై సర్వే నిర్వహించి వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తున్నారని వెల్లడించా రు. బ్యాంక్‌ సేవలను పరిసర గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. స్థానిక జెడ్పీహెచ్‌ఎస్‌లో నిర్వహించిన విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలను కలెక్టర్‌ తిలకించారు. కార్యక్రమాల్లో బ్యాంక్‌ ప్రాంతీయ మేనేజర్‌ అ ప్పారావు, బ్రాంచ్‌ మేనేజర్‌ రోహిత్‌ శర్మ, ఎంపీడీవో మహేశ్‌, నాయబ్‌ తహసీల్దార్‌ వామన్‌, స ర్పంచులు భూపతిరెడ్డి, అశోక్‌ ఠాక్రే, హెచ్‌ఎం సు దర్శన్‌, నాయకులు రఘుకుల్‌రెడ్డి, రూపేశ్‌రెడ్డి, బాలచందర్‌, బ్యాంక్‌ సిబ్బంది పాల్గొన్నారు.

16న ప్రత్యేక ప్రజావాణి

కైలాస్‌నగర్‌: తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 16న కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హల్‌లో ఉదయం 10.30 నుంచి ప్రత్యేకంగా పిల్లల ప్రజావాణి నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ రాజర్షి షా తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రచార పోస్టర్‌ను కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడు తూ.. పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలు గుర్తించి, సత్వర పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో ప్రత్యేక ప్రజావాణి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా సంరక్షణ అవసరమైన పిల్లలు, ది వ్యాంగులు, వారి తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వి ద్య, వైద్యం, పోషకాహారం, బాల కార్మికత్వం, బాల్యవివాహలు, బాలల భిక్షాటన, వేధింపులు తదితర సమస్యలపై బాధితులు తమ అర్జీలను నేరుగా అధికారులకు అందజేయవచ్చని తెలిపా రు. పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని స్ప ష్టం చేశారు. ఫిర్యాదుదారుల వివరాలను పూర్తి గోప్యంగా ఉంచుతామని తెలిపారు. బాలలపై ఎ లాంటి వేధింపులు జరిగినా, వారి హక్కులకు భంగం కలిగినా నిర్భయంగా అధికారుల దృష్టికి తేవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1098ను సంప్రదించాలని సూ చించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ రాజేశ్వర్‌, జెడ్పీ సీఈవో రవి, డీఆర్డీవో రవీందర్‌ రాథోడ్‌, డీపీవో రమేశ్‌, మెప్మా పీడీ రాజు, డీసీపీవో రాజేంద్రప్రసాద్‌, చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement