జిల్లా కవికి కాళోజీ పురస్కారం | - | Sakshi
Sakshi News home page

జిల్లా కవికి కాళోజీ పురస్కారం

Nov 14 2026 1:11 AM | Updated on Nov 14 2026 1:11 AM

ఆదిలాబాద్‌: జిల్లాకు చెందిన కవి, రచయిత డాక్టర్‌ ఉదారి నారాయణకు కాళోజీ నారాయణరావు స్మారక పురస్కారం లభించింది. శుక్రవారం వరంగల్‌లో ప్రముఖ నవలా రచయిత అంపశయ్య నవీన్‌ చేతుల మీదుగా అవార్డు స్వీకరించారు. ఈ సందర్భంగా రూ.10 వేల నగదు, ప్రశంసాపత్రం, జ్ఞాపిక అందజేశారు. నారాయణ వచన కవిత్వంతో పాటు నాటికలు, గేయాలు, కథల్లో తెలంగాణ పల్లె భాషను సహజంగా ఉపయోగిస్తున్నారని ప్రశంసించారు. ప్రజాకవి కాళోజీ పేరిట అవార్డు అందుకోవడం గౌరవంగా భావిస్తున్నానని నారాయణ పేర్కొన్నారు. కార్యక్రమంలో నాగిళ్ల రామశాస్త్రి, వీఆర్‌ విద్యార్థి, పొట్లపల్లి శ్రీనివాస్‌, నెల్లుట్ల రమాదేవి తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement